హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోజనం విషయంలో గొడవ.. భార్య అదృశ్యం

ELR: భోజనం విషయంలో భార్యా భర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో భార్య కనిపించకుండా పోయిన ఘటన ఏలూరులో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న నవీన్ పూర్ణచంద్ ఈ నెల 16న భార్య ఝాన్సీతో భోజనం విషయంలో వాగ్వాదం జరిగింది. అనంతరం రాత్రి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. 17న నిద్రలేచి చూడగా ఝాన్సీ కనిపించలేదన్నారు.