హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో మ్యాపింగ్ లేని ఓటర్ల విచారణ

WG: తాడేపల్లిగూడెం మండలం మాధవరం, జగన్నాధపురం గ్రామాల్లో 11 పోలింగ్ బూత్ లకు సంబంధించి మ్యాపింగ్ లేని, లోటుపాట్లు ఉన్న ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆయా గ్రామాల్లో తహశీల్దార్ ఎం. సునీల్ కుమార్ విచారణ నిర్వహించారు. ప్రతీ ఓటరు వ్యక్తిగతంగా సమర్పించిన ఆధారాలు పరిశీలించి, వారి వివరణ విని సరైన ఓటర్లను జాబితాలో నమోదు చేస్తామని తెలిపారు.