TPT: చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంత సమీపంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగులు మైలావాండ్లపల్లి, మల్లెలవాండ్లపల్లి ఎస్సీ కాలనీ, దేవరకొండ, తుమ్మసేనపల్లి, కొత్తపల్లి, గొల్లపల్లి, నగిరిసిరిగలవారిపల్లె గ్రామాల పరిధిలోని పంట పొలాల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఏనుగుల సంచారం.. అధికారుల హెచ్చరిక


