PLD: చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శీలం రాజేశ్వరి(18) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుమారు ఏడు నెలల క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. రాజేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి


