హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

SKLM: నందిగాం పోలీస్‌ స్టేషన్‌‌ను జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌‌‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.