హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులపై దురుసు ప్రవర్తన.. కేసు నమోదు

ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న వాహన తనిఖీలు చేస్తుండగా కిషన్ అనే వ్యక్తి పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI ప్రేమ్ కుమార్ తెలిపారు. పెండింగ్ చలాన్లు అడిగినందుకు కానిస్టేబుల్‌ను తోసివేసి దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.