W.G: నరసాపురం ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం రూ.470 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదని తెలిపారు. హార్బర్ పూర్తయితే సుమారు 30 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫిషింగ్ హార్బర్ పనులు వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్యే


