ASR: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. కొయ్యూరు మండలం డౌనూరులో టీడీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అందించిన సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వంతోనే మంచి భవిష్యత్తు: మాజీ ఎమ్మెల్యే


