హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై 364 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 364 కేసులు నమోదు చేసి రూ.87,425 జరిమానా విధించినట్లు SP విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.