KDP: చాపాడు మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో బుధవారం గ్రామ పంచాయతీల అభివృద్ధి, గ్రామాల పరిశుభ్రతపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పంచాయతీల అభివృద్ధిపై శిక్షణ: MPDO


