హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్రకు అనుమతి లేదు: ఎస్పీ

KRNL: హత్యకు గురైన సుగాలి ప్రీతి భాయ్ తల్లి పార్వతి కర్నూలు నుంచి అమరావతి వరకు చేపట్టనున్న వీల్‌చైర్ యాత్రకు పోలీసుల అనుమతి లేదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా యాత్ర, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.