E.G: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. గోరక్షణపేటలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను తనిఖీ చేశారు. అనుమతి పొందిన ప్లాన్లకు అనుగుణంగా కడితేనే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
భవన యజమానులకు కమిషనర్ సూచనలు


