కోనసీమ: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్యా ఆదేశించారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన క్రైమ్ మీటింగ్‌లో కేసుల దర్యాప్తు పురోగతిని ఆమె సమీక్షించారు. నేరాల నియంత్రణకు రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా పెంచడంతో పాటు గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి'


