హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: బల్లికురవ మండలం వేమవరం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో బుధ, గురువారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉపకేంద్రం పరిధిలోని పారిశ్రామిక ఫీడర్, మల్లాయపాలెం వ్యవసాయ ఫీడర్లకు ఈ రెండు రోజులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యవసర మరమ్మతు పనుల కారణంగానే సరఫరా నిలిపిస్తున్నామన్నారు.