హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ధర్మవరానికి తాగునీటి సరఫరాలో అంతరాయం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ధర్మవరం ఏరియాకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. సోముదేవిపల్లి హెడ్ వాటర్ వర్క్స్ నందు ఒక మోటారు పనిచేయకపోవడంతో వాటర్ పంపింగ్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.