హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన ఎస్సీ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.