హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: DEO

KDP: జిల్లా స్థాయి ఉపాధ్యాయ పురస్కారం–2026కు అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో షంషుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, ఎయిడెడ్, పురపాలక, తదితర గుర్తింపు పొందిన యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు ఈ నెల 28లోపు సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.