హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టోల్‌గేట్ వద్ద పోలీసుల ప్రత్యేక తనిఖీ

BPT: సంతమాగులూరు మండలంలోని టోల్‌గేట్ వద్ద సీఐ పి.శేషగిరిరావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను ఆపి వాహన పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్సులను పరిశీలించారు.