హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతకు SBI ఉచిత శిక్షణ

NLG: నల్గొండ రాంమ్‌నాగర్ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతకు హౌస్ వైరింగ్‌లో 31 రోజుల ఉచిత శిక్షణను అందజేస్తున్నామన్నారు. సంస్థ సంచాలకుడు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18- 50 లోపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఆగష్టు 21 ఆఖరి అని చెప్పారు.