హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14 మంది డీలర్లపై 6ఏ కేసులు: జేడి

KRNL: అధిక ధరలకు రసాయన ఎరువులు విక్రయించడం, ఇతర ఉత్పత్తులను ఎరువులతో లింక్ చేస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు 14 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసి రూ.1.35 కోట్ల ఎరువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో భాగంగా 20 లైసెన్సులు సస్పెండ్ చేశామని తెలిపారు.