హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్వోపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు

సత్యసాయి: వీఆర్వోపై దాడి చేసిన ఘటనలో అడివన్న అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామచంద్రానాయక్ తెలిపారు. తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు వైబీహళ్లి గ్రామంలో భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన వీఆర్వో నరసప్పపై అదే గ్రామానికి చెందిన అడివన్న దాడికి పాల్పడ్డాడు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై వెల్లడించారు.