ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాలో రానున్న ఐదు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణ స్వామి తెలిపారు. ఈ ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 35.2 డిగ్రీలు, రాత్రివేళ ఉష్ణోగ్రతలు 24.5 నుంచి 25 డిగ్రీల వరకు నమోదు కావచ్చని ఆయన వెల్లడించారు. వర్షం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రానున్న ఐదు రోజులు తేలికపాటి వర్షాలు


