హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం జిల్లా పర్యటన రద్దు

ATP: ఈ నెల 22న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలంలో జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని తహసీల్దార్ శ్రీధరమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో సదాశివ చెప్పారు. ఆ రోజు ఇదే కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్నట్లు సమాచారం అందిందని వారు వెల్లడించారు.