హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగు, తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి: ఎమ్మెల్యే

ATP: తాగునీటితోపాటు రైతుల ప్రయోజనాల కోసం సాగునీరు కూడా విడుదల చేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో తుంగభద్ర నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జిల్లాలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు సాగునీరు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.