హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే శ్రావణి భేటీ

ATP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పేదలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ పత్రాలను అందించి, నిధులు విడుదల చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విన్నవించారు. వినతిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆమె పేర్కొన్నారు.