హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉయ్యాలవాడ' పేరుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

KRNL: కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టేలా జీఓ విడుదల చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి మంగళవారం ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిర్రు ప్రతాప్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, కేంద్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి జీఓకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.