హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర ఆలయ హుండీకి భారీ ఆదాయం

SRCL: వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ హుండీకి భక్తుల కానుకలతో భారీ ఆదాయం సమకూరింది. 47 రోజుల పాటు వచ్చిన కానుకలను లెక్కించగా రూ.2.31 కోట్లకు పైగా నగదు లభించింది. అలాగే 137.3 గ్రాముల మిశ్రమ బంగారం, 9.2 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆషాఢ మాసంలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని పీఆర్వో పెరిక శ్రీనివాస్ తెలిపారు.