హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినోపై అవగాహన

SRCL: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులను ప్రోత్సహించాలని సూచించారు. ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పనులు చేపట్టాలని, డెంగ్యూ, మలేరియా నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.