హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి'

NDL: నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ కాలనీలోని టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కాలనీలో ఆకస్మికంగా తనిఖీ చేసి పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, ఇతర వసతులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఈ మేరకు కలెక్టర్ సూచించారు.