హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌ను కలిసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే

NDL: గోరుకల్లు జలాశయం నుంచి శ్రీశైలం కుడి శాఖా కాలువ(SRBC)కి తక్షణమే నీటిని విడుదల చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ రాజకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడేందుకు వెంటనే నీరు విడుదల చేయాలన్నారు.