హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేర నియంత్రనే లక్ష్యం: ఎస్పీ

NDL: నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ సునీల్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, మట్కా, గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక యాప్‌లు, సాంకేతికతను వినియోగించాలని సూచించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.