హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

NZB: భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.