హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంకర రోడ్డుపై ప్రయాణించటం కష్టతరం

ప్రకాశం: టంగుటూరు(M) మర్లపాడు నుంచి కొణిజేడు వెళ్లే రహదారి పనులు ప్రారంభించి కంకర పరిచి పనులు నిదానంగా సాగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లేచిన కంకరపై వాహనాలు ప్రయాణించాలంటే కష్టంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. రహదారిపై కంకరవేసి తదుపరి పనులు మొదలు పెట్టకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. కంకరపై ప్రయాణించే వాహనాలు అదుపు తప్పితే గాయాలు అవుతున్నాయని స్థానికులు అంటున్నారు.