అన్నమయ్య: చిట్వేల్–పెంచలకోన ప్రధాన ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం చిరుత కనిపించింది. చిట్వేల్ నుంచి పెంచలకోనకు వెళ్తున్న ప్రయాణికులకు మూడో మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న గోడపై చిరుత కనిపించగా, కారు రావడంతో సమీపంలోని చెట్లలోకి వెళ్లిపోయింది. రాత్రివేళ ఈ మార్గంలో ప్రయాణించే వారు, ముఖ్యంగా బైక్‌లు, ఆటోలపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేల్‌లో చిరుత సంచారం కలకలం


