KMM: వైరా మండలం సోమవరం గ్రామంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిని సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రెండు బైకులు ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్


