హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ హత్య కేసు.. నిందితుడి అరెస్ట్

NGKL: తాడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనపై DSP బుర్రి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలకపల్లి (M) రాకొండ గ్రామానికి చెందిన నాగి బంగారమ్మ భీమయ్యకు కొంత నగదు అప్పుగా ఇచ్చింది. డబ్బులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో భీమయ్య బంగారమ్మను బొలెరో వాహనంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.