NLG: సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేయాలని సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో రైతుల పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను కాలువ నీటితో నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి'


