హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

MDK: హవేలిఘనాపూర్ పోలీస్ స్టేషన్‌ను మెదక్ ఎస్పీ DV శ్రీనివాసరావు మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. పోలీస్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్ నమోదు తీరు, రౌడీ షీట్లు, సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య నమోదు ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ సిబ్బంది పనితీరుపై సమీక్ష జరిపి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.