హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉద్యోగాల కోసం అవకాశం

KMM: జిల్లా టీటీడీసీలో ఈ నెల 19న ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. మాధవి తెలిపారు. ఎల్‌ఐసీ, ఇండస్‌ఇండ్, నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో 95 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులు విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.