NRPT: బోయిన్‌పల్లి గ్రామంలో మహిళా సమైక్య భవనం నిర్మాణానికి నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మహిళలు ఒకచోట సమావేశమయ్యేందుకు మహిళా సమైక్య భవనం ఉండాలనే ఉద్దేశంతో భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మల్లేష్, వెంకటయ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సమైక్య భవననిర్మాణానికి భూమి పూజ


