హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

MDK: మహిళలు స్వయంశక్తితో ఎదిగేందుకే ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మెదక్ మిల్లీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఉమర్ ఖాన్ తెలిపారు. కొల్చారంలో అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆసక్తి ఉన్న మహిళలు కులమతాలకు అతీతంగా తమ పేర్లను నమోదు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.