హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అందుబాటులో ఎరువుల నిల్వ

KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు కాంప్లెక్స్ ఎరువులు చేరినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య తెలిపారు. ఇందులో 319.250 మెట్రిక్ టన్నుల అమ్మోనియం సల్ఫేట్, 1,018.200 మెట్రిక్ టన్నుల 20:20:00:13 ఎరువులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిని ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు కేటాయించి, మిగిలిన నిల్వను బఫర్ స్టాక్‌గా ఉంచినట్లు తెలిపారు.