హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు

VKB: పెద్దేముల్ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అన్నారు. పెద్దేముల్, మంబాపూర్, జనగాం, మారేపల్లి గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. పెద్దేముల్ అధ్యక్షుడిగా కుమ్మరి సాయిలు, మంబాపూర్‌కు పీటర్ యాదయ్య, మారేపల్లికి వెంకట్‌ను నియమించారు. పార్టీ పటిష్టతకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.