RR: రైతుల సంక్షేమమే లక్ష్యంగా మేకగూడ పీఏసీఎస్‌ను అభివృద్ధి చేస్తామని చైర్మన్ అంబటి ప్రభాకర్ అన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి రుణ బకాయిల వసూళ్లు, రుణాల మంజూరు, సొసైటీ ఆర్థిక వనరులపై చర్చించారు. రైతుల ప్రయోజనాల కోసం పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ విఘ్నేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతుల సంక్షేమమే లక్ష్యం: అంబటి ప్రభాకర్


