హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదర్శ పాఠశాల, వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

NZB: సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, వసతి గృహాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహమ్మద్ రఫీ అహ్మద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.