NRML: దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామాన్ని డిప్యూటీ కమిషనర్ సుధాకర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫామ్‌పాండ్, చేపల చెరువు, స్టీల్ బ్యాంక్‌ను పరిశీలించారు. అనంతరం డస్ట్‌బిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామస్తులకు పలు విలువైన సూచనలు చేశారు. కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీఓ, డీఆర్డీఓ, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గుండంపల్లిలో పర్యటించిన డిప్యూటీ కమిషనర్


