BHNG: భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రేవనపల్లి గ్రామానికి చెందిన సురుకంటి బస్వారెడ్డి పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మైసమ్మ కత్వ సమీపంలో రోడ్డుపై ఉన్న కోతులను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్వారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ
కోతులను తప్పించబోయి కారు బోల్తా


