హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి'

NRPT: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని గీత సంఘం నాయకులు పెద్దింటి శంకర్ గౌడ్, కృష్ణయ్య గౌడ్, బిజ్వార్ నాయకులు మహేష్ గౌడ్, నాగేష్ గౌడ్, ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఊట్కూర్ మండలంలోని బిజ్వార్, ఊట్కూర్ గ్రామాల్లో ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.