హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంచాయతీలో సిబ్బంది కరువు'

NLG: అనుముల మండలం ఇబ్రహీంపేటలో ప్రజాభిప్రాయం మేరకు గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. కానీ ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేదు. దీంతో పరిపాలన పూర్తిగా స్తంభించింది. గత ఆరేండ్ల క్రితం హాలియా మున్సిపాలిటీలో విలీనమైన ఇబ్రహీంపేటను తిరిగి గ్రామ పంచాయతీగా మార్చారు. పంచాయతీగా మారి దాదాపు ఏడాది అవుతున్నా గ్రామం ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోలేదు.