హైదరాబాద్: 28°C
వ్యాపారం

YouTube: వ్యూస్‌ లెక్కించే విధానంలో మార్పు

యూట్యూబ్‌లో వీడియో వ్యూస్‌ను లెక్కించే విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై వీడియో మొదటి ఫ్రేమ్ నుంచే వ్యూస్‌ను కౌంట్ చేయనున్నారు. అంతకుముందు ఈ విధానం షార్ట్స్‌కు మాత్రమే ఉండేది. గందరగోళ పరిస్థితులకు తావు లేకుండా అన్ని వీడియో ఫార్మాట్‌లకు ఈ లెక్కింపు విధానాన్ని అమలుచేయడానికి యూట్యూట్ నిర్ణయించింది. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.